వైసీపీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చు.. నేను కూడా పోటీ చేస్తా: రఘురామకృష్ణరాజు

18-10-2021 Mon 16:44
  • పార్టీలో సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలి
  • నేను క్రమశిక్షణ గల కార్యకర్తను
  • అందుకే నన్ను సస్పెండ్ చేయలేదు 
  • వైసీపీ నేతలు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు   
I will contest for YSRCP president says Raghu Rama Krishna Raju
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధ్యక్ష పదవికి తాను పోటీ పడతానని ఆయన అన్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని అన్నారు. తాను క్రమశిక్షణ గల కార్యకర్తనని... అందుకే తనను ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని చెప్పారు. తనపై వైసీపీ నేతలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు రఘురాజు లేఖ రాశారు. తనపై వైసీపీ ఎంపీలు ఇచ్చిన అనర్హత పిటిషన్ ను కొట్టివేయాలని లేఖలో కోరారు.