బీసీసీఐ ఆఫర్ ను తిరస్కరించిన లక్ష్మణ్

18-10-2021 Mon 15:06
  • నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా లక్ష్మణ్ కు ఆఫర్ 
  • ప్రస్తుతం అకాడమీ హెడ్ గా ఉన్న ద్రావిడ్
  • టీమిండియా హెడ్ కోచ్ గా వెళ్లనున్న ద్రావిడ్
VVS Lakshman rejects BCCI offer
స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఆ ఆఫర్ ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా వెళ్లడం దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. ద్రావిడ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా లక్ష్మణ్ ను నియమించాలని బీసీసీఐ భావించింది.

ఇదే విషయాన్ని లక్ష్మణ్ వద్ద ప్రస్తావించగా... ఆ పదవిని చేపట్టేందుకు ఆయన ఇష్టపడలేదు. బెంగాల్ జట్టుకు కన్సల్టెంట్ గా, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు మెంటార్ గా లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. దీంతో నేషనల్ క్రికెట్ అకాడమీకి లక్ష్మణ్ సరిపోతాడని బీసీసీఐ భావించింది.