ఓడిపోయిన వాళ్లకు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్

18-10-2021 Mon 14:21
  • 'మా' ఎన్నికల వ్యవహారంలో బాబూ మోహన్ వ్యాఖ్యలు
  • ప్రత్యర్థి ప్యానెల్ పై విమర్శలు
  • కాస్త ఆవేశం తగ్గించుకోవాలని సలహా  
  • తదుపరి టర్మ్ కూడా విష్ణునే ఉంటాడని ధీమా
Babu Mohan responds on MAA issues
'మా' ఎన్నికల వ్యవహారంపై సీనియర్ నటుడు బాబూ మోహన్ స్పందించారు. ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదాలను తాము వదిలేయాలని అనుకున్నప్పటికీ, ప్రత్యర్థి ప్యానెల్ మాత్రం ఆ వ్యవహారాలను వదలడంలేదని ఆరోపించారు. అందరం కళామతల్లి బిడ్డలం అన్న సంగతి మరువరాదని, 'మా' అధ్యక్షుడిగా విష్ణు ఈ రెండేళ్లే కాకుండా, ఆ తర్వాత రెండేళ్లు కూడా ఉంటాడని పేర్కొన్నారు.

'మా' ఎన్నికల్లో ఓడినవాళ్లకు కూడా విష్ణునే అధ్యక్షుడు అని, ప్రత్యర్థి ప్యానెల్ కాస్త ఆవేశం తగ్గించుకోవాలని బాబూ మోహన్ అన్నారు. విష్ణును, ఇతర విజేతలను అంగీకరించకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించబోరని అన్నారు. ప్రత్యర్థి ప్యానెల్ కూడా సహకరించాలని, అందరి సంక్షేమమే పరమావధిగా విష్ణు పనిచేస్తారని వివరించారు.