టీమిండియా మెంటార్ గా పని ప్రారంభించిన ధోనీ... ఫొటోలు ఇవిగో!

  • టీమిండియా సలహాదారుగా ధోనీ
  • ఆటగాళ్లతో కలిసి మైదానంలోకి వచ్చిన ధోనీ
  • ఆటగాళ్లకు బ్యాటింగ్ లో సలహాలు
  • రారాజుకు స్వాగతం అంటూ బీసీసీఐ పోస్టు
Dhoni starts work as Team India mentor

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు జట్టుకు మరో టైటిల్ అందించి మాంచి ఊపుమీదున్న ఎంఎస్ ధోనీ ప్రస్తుతం టీమిండియా మెంటార్ గా కొత్త బాధ్యతలు అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాగా, భారత ఆటగాళ్లు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో జట్టు సలహాదారుగా ధోనీ తన పని ప్రారంభించాడు. ప్రాక్టీసు సందర్భంగా ఆటగాళ్లతో పాటు మైదానంలోకి వచ్చాడు. బ్యాటింగ్ లో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ ధోనీ బిజీగా కనిపించాడు.

దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. రారాజుకు హార్దిక స్వాగతం అంటూ పేర్కొంది. టీమిండియాతో ధోనీ మరోసారి జతకలిశాడని, అయితే ఈసారి కొత్త పాత్రలో కనిపిస్తున్నాడని వెల్లడించింది. మెంటార్ గా వ్యవహరిస్తున్నందుకు ధోనీ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడంలేదని సమాచారం. మెంటార్ గా ధోనీ నియామకం టీ20 వరల్డ్ కప్ వరకేనని తెలిసిందే.

కాగా, టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో తన ప్రస్థానాన్ని పాకిస్థాన్ తో మ్యాచ్ ద్వారా ప్రారంభించనుంది. దాయాదుల మధ్య సమరం ఈ నెల 24న జరగనుంది.

More Telugu News