టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ బౌలింగ్ దాడులను ఎదుర్కొని గౌరవప్రదమైన స్కోరు సాధించిన స్కాట్లాండ్

17-10-2021 Sun 21:33
  • టీ20 వరల్డ్ కప్
  • బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్
  • టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 రన్స్
Scotland posts reasonable score
టీ20 వరల్డ్ కప్ లో రెండ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ పదునైన బంగ్లాదేశ్ బౌలింగ్ దాడులను ఎదుర్కొని గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది.

స్కాట్లాండ్ ఓ దశలో 53 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా... క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్ జోడీ బ్యాట్లు ఝుళిపించడంతో స్కోరు 100 దాటింది. గ్రీవ్స్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా, వాట్ 17 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 3, షకీబ్ అల్ హసన్ 2, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 2, తస్కిన్ అహ్మద్ 1, మహ్మద్ సైఫుద్దీన్ 1 వికెట్ తీశారు.