కుడిచేయి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించా: చిరంజీవి

17-10-2021 Sun 20:50
  • చేతికి కట్టుతో దర్శనమిస్తున్న చిరంజీవి
  • అభిమానుల ఆందోళన
  • స్పందించిన మెగాస్టార్
  • చేతికి శస్త్రచికిత్స జరిగిందని వెల్లడి
Chiranjeevi explains why he went for a surgery to right hand
మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేతికి కట్టుతో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవికి ఏమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. కుడిచేయి నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించానని వెల్లడించారు. మణికట్టు వద్ద నరంపై ఒత్తిడి పడిందని వైద్యులు చెప్పారని తెలిపారు. దాంతో కుడిచేతికి అపోలో వైద్యులు చిన్నపాటి శస్త్రచికిత్స చేశారని వివరించారు. 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు.