మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్.... అకారణంగా తన పేరు బయటికి వచ్చిందన్న మెగాస్టార్!

  • ఇటీవల ముగిసిన 'మా' ఎన్నికలు
  • తీవ్ర స్పర్ధలతో ఎన్నికలు
  • ప్రకాశ్ రాజ్ కే చిరు మద్దతు అంటూ ప్రచారం
  • తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదన్న చిరంజీవి
Chiranjeevi talks to Mohan Babu

ఇటీవల ముగిసిన 'మా' ఎన్నికల నేపథ్యంలో నటుడు మోహన్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఫోన్ చేశారు. మా ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతు తెలపలేదని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండానే తన పేరు బయటికి వచ్చిందని వివరణ ఇచ్చారు. మోహన్ బాబుతో ఎప్పటిలాగానే తన స్నేహబంధం కొనసాగుతుందని చిరంజీవి స్పష్టం చేశారు.

చిరంజీవి ఫోన్ కాల్ కు మోహన్ బాబు స్నేహపూర్వకంగా స్పందించారు. అందరం కలసికట్టుగా ఉండాలన్నదే తన అభిప్రాయమని చిరంజీవికి తెలిపారు. ఈ సందర్భంగా వీరిరువురు 'మా' ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఇతర పరిణామాలపైనా చర్చించుకున్నారు.

ఇటీవల 'మా' ఎన్నికల సమయంలో టాలీవుడ్ లో మోహన్ బాబు ఫ్యామిలీ ఒకవైపు, మెగా ఫ్యామిలీ మరోవైపు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రకాశ్ రాజ్ కు తమ కుటుంబం మద్దతు ఇస్తుందని నాగబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా ప్రకాశ్ రాజ్ కే మద్దతుగా నిలిచారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో నిజంలేదని నేడు చిరంజీవి ఖండించారు.

More Telugu News