టీ20 వరల్డ్ కప్: స్కాట్లాండ్ పై టాస్ నెగ్గిన బంగ్లాదేశ్

17-10-2021 Sun 19:27
  • టీ20 వరల్డ్ కప్ లో రెండో మ్యాచ్
  • బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్
  • బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • ఆల్ రౌండర్లతో తొణికిసలాడుతున్న బంగ్లా జట్టు
Bangladesh won the toss and elected bowl first against Scotland
టీ20 వరల్డ్ కప్ లో నేడు రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తలపడుతున్నాయి. అల్ అమేరత్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ జట్టు తమ ఆల్ రౌండర్లపై నమ్మకం పెట్టుకుంది. తమ జట్టులో ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారని బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా వెల్లడించాడు.

అటు, స్కాట్లాండ్ సారథి కైల్ కోయెట్జర్ మాట్లాడుతూ, టాస్ ఓడినా మొదట బ్యాటింగ్ చేయనుండడం సంతోషం కలిగిస్తోందని అన్నాడు. లక్ష్యఛేదన చేయాలని నిర్ణయించుకున్న బంగ్లాదేశ్ ను ఇబ్బందులకు గురిచేస్తామని చెప్పాడు.