కేరళలో 21కి పెరిగిన మృతుల సంఖ్య... వర్షాలపై సీఎం విజయన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ

17-10-2021 Sun 18:43
  • కేరళలో భారీ వర్షాలు
  • విరిగిపడుతున్న కొండచరియలు
  • భారీగా ప్రాణనష్టం
  • కేరళలో పరిస్థితి దురదృష్టకరమన్న ప్రధాని మోదీ
  • బాధితులకు పునరావాసం కల్పించాలని సూచన
PM Modi talks to Kerala CM Vijayan on rains and landslides
కేరళలో భారీ వర్షాలు కురియడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 21కి పెరిగింది. 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడారు. వర్ష బీభత్సంపై చర్చించారు. కేరళ ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు మోదీ తెలిపారు. బాధితుల పునవారాసం కోసం చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు.

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు మోదీ మలయాళంలో ట్వీట్లు చేశారు.