T20 World Cup: ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్... తొలి మ్యాచ్ లో ఒమన్ వర్సెస్ పాపువా న్యూగినియా

  • నేటి నుంచి టీ20 వరల్డ్ కప్
  • యూఏఈ వేదికగా మెగా ఈవెంట్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఒమన్
  • సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాపువా న్యూగినియా
ICC World Cup begins

యూఏఈ, ఒమన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 క్రికెట్ వరల్డ్ కప్ సంరంభం ప్రారంభమైంది. ఒమన్, పాపువా న్యూగినియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. అల్ అమేరత్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఒమన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

ఒమన్ తో పోల్చితే చాలా చిన్న జట్టయిన పాపువా న్యూగినియా సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. స్కోరుబోర్డుపై పరుగులేమీ లేకుండానే ఓపెనర్లు టోనీ ఉరా, లెగా సియాకా పెవిలియన్ చేరారు. ఒమన్ బౌలర్లు బిలాల్ ఖాన్, కలీముల్లా చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో పాపువా న్యూగినియా కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ అమిని ఉన్నారు. ఆ జట్టు స్కోరు 3 ఓవర్లలో 2 వికెట్లకు 11 పరుగులు.

ఈ మెగా టోర్నీలో తొలి దశలో 8 జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ జరగనుంది. ఈ 8 జట్ల నుంచి అత్యధిక విజయాలు సాధించిన 4 జట్లు సూపర్-12 దశకు చేరుకుంటాయి. అక్కడ పెద్ద జట్లతో కలిసి మరోసారి రౌండ్ రాబిన్ లీగ్ ఆడతాయి.

More Telugu News