'పెళ్లిసందD' హీరోయిన్ శ్రీలీల నా కూతురు కాదు: వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు

17-10-2021 Sun 15:13
  • దసరాకు విడుదలైన 'పెళ్లిసందD'
  • హీరోయిన్ గా నటించిన శ్రీలీల
  • ఆమె తన మాజీ భార్య కూతురన్న శుభాకరరావు
  • తన పేరు చెప్పుకుంటున్నారని ఆరోపణ
Businessman Surapaneni Subhakarrao clarifies that PellisandaD heroine Sri Leela is not his daughter
ఇటీవల విడుదలైన 'పెళ్లిసందD' చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల తన కుమార్తె కాదని వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు స్పష్టం చేశారు. శ్రీలీల తన మాజీ భార్య కుమార్తె అని వెల్లడించారు. తాము విడిపోయిన తర్వాతే శ్రీలీల జన్మించిందని తెలిపారు. మాజీ భార్య నుంచి తాను విడిపోయి 20 ఏళ్లు అవుతోందని అన్నారు.

అయితే తన నుంచి ఆస్తులను రాబట్టేందుకు తన పేరు చెప్పుకుంటున్నారని శుభాకరరావు ఆరోపించారు. తన మాజీ భార్యతో విడాకుల వ్యవహారం ఇంకా న్యాయస్థానంలో నడుస్తోందని వివరించారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళతానని వెల్లడించారు.