రేపు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్న సీఎం జగన్

17-10-2021 Sun 14:43
  • సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పర్యటన
  • ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శించనున్న సీఎం
  • అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశం
  • ఆశ్రమంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు
CM Jagan will visit Ganapati Sachidananda Swami ashram tomorrow
సీఎం జగన్ రేపు (సోమవారం) గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. విజయవాడ పటమట దత్తానగర్ లో ఉన్న సచ్చిదానంద ఆశ్రమానికి సీఎం జగన్ వస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం సెక్యూరిటీ అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆశ్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ పర్యటన కోసం సీఎం జగన్ రేపు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరతారు. 10.30 ఆశ్రమానికి చేరుకుని 20 నిమిషాల పాటు ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశమవుతారు. ఈ భేటీ 11.30 గంటల వరకు సాగనుంది. అనంతరం సీఎం జగన్ తన నివాసానికి తిరుగు పయనమవుతారు.