Manchu Lakshmi: ‘మా’ ఎన్నికలు.. ఇక చాలు ఆపండి.. అంటూ మంచు లక్ష్మి ఫైర్

Manchu Laxmi Angry Over Netizens Comments
  • తమ్ముడికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
  • పంచులు వేస్తూ నెటిజన్ల కామెంట్లు
  • ఘాటుగా బదులిచ్చిన లక్ష్మి
నెటిజన్లపై మంచు లక్ష్మి మండిపడ్డారు. కామెంట్ చేసేందుకు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా? అని ఎదురుచూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన తన తమ్ముడు విష్ణుకు శుభాకాంక్షలు చెబుతూ ఆమె నిన్న ట్వీట్ చేశారు.

‘‘ఈరోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం. నా సోదరుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రపంచాన్ని మార్చేందుకు ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించే ఈ కొత్త ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు తీసుకొస్తావో చూస్తుంటాను’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఆమె ట్వీట్ కు నెటిజన్లు పంచులు వేయడం మొదలుపెట్టారు. ‘మా’ అధ్యక్షుడు ప్రపంచం మొత్తాన్ని ఎలా మార్చగలడంటూ వరుస కామెంట్లు చేస్తున్నారు. దీనిపైనే ఆమె మండిపడ్డారు. ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఇక చాలు ఆపండి. ఎప్పుడు చాన్స్ వస్తుందా.. ఎవర్ని కామెంట్ చేద్దామా? అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ప్రపంచం. విషయాన్ని అర్థం చేసుకోండి. నా ఉద్దేశం మీరనుకునే ప్రపంచం కాదు. ‘మా’ అసోసియేషన్ అనే ప్రపంచాన్ని మార్చడం’’ అని అన్నారు.
Manchu Lakshmi
MAA
Tollywood
Manchu Vishnu

More Telugu News