క్వారంటైన్ లో విరాట్.. ఏమనాలో తెలియట్లేదంటూ ఇన్ స్టాలో ఫొటోలు పెట్టిన అనుష్క శర్మ

17-10-2021 Sun 14:09
  • దుబాయ్ లో టీ20 వరల్డ్ కప్
  • అక్కడే క్వారంటైన్ బబుల్ లో ఉండిపోయిన కోహ్లీ
  • హోటల్ పక్క గదిలోనే దిగిన అనుష్క
  • దూరం నుంచే పలకరింపులు
In Times Of Quarantine Anushka Love For Virat
ఐపీఎల్ అయిపోయింది. అది అలా ముగిసిందో లేదో.. అప్పుడే టీ20 మహాసంగ్రామం మొదలైపోతోంది. ఇవాళ్టి నుంచి వరల్డ్ కప్ మొదలవుతోంది. యూఏఈలోనే మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, ఐపీఎల్ అవగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అక్కడే ఉండిపోయాడు. ప్రస్తుతం క్వారంటైన్ బబుల్ లో గడుపుతున్నాడు. అతడున్న అదే హోటల్ లోని అతడి పక్క రూమ్ లోనే విరాట్ భార్య అనుష్క శర్మ దిగింది. వారిద్దరి మధ్యా పలకరింపులు దూరం నుంచే జరుగుతున్నాయి.


అయితే, క్వారంటైన్ లో దూరంగా ఉన్నా ప్రేమ మాత్రం తగ్గిపోలేదంటూ ఆమె పోస్టు పెట్టింది. పలు ఫొటోలను ఇన్ స్టాలో పంచుకుంది. విరాట్ తన రూమ్ బాల్కనీ నుంచి అనుష్కకు హాయ్ చెబుతున్న ఫొటోను, లాన్ నుంచి చెయ్యి ఊపుతున్న ఫొటోలను షేర్ చేసింది. ‘ద 8’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆమె.. ఏం రాయలో తెలియట్లేదంటూ కామెంట్ చేసింది. ‘‘క్వారంటైన్ తో హృదయంలో ప్రేమ ఉప్పొంగుతోంది.. బబుల్ జీవితంలో ప్రేమ.. ఈ రెండింట్లో ఏ క్యాప్షన్ పెట్టాలో అర్థం కావట్లేదు’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది.