MAA: ‘మా’ ఎన్నికలపై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్లు

Rajendra prasad Comments On MAA Elections
  • ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ మీడియాకు సమాధానం
  • వేరే విషయాలు అడగాలంటూ సూచన
  • కుటుంబ సమేతంగా ద్వారకా తిరుమలను సందర్శించిన రాజేంద్రప్రసాద్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని చిన్న తిరుపతిగా పిలిచే ద్వారకా తిరుమల వెంకన్నను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఆయన్ను ‘మా’ ఎన్నికలపై అభిప్రాయం చెప్పాలని అడగ్గా.. ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ సమాధానమిచ్చారు.

ఆ విషయం తప్ప మిగతా విషయాలు అడగాల్సిందిగా మీడియాకు చెప్పారు. ‘మా’ ఎన్నికలపై తప్ప మిగతా వాటిపై ఆయన సమాధానాలు చెప్పారు. ఈ నెల 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ వర్గం సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను చేపట్టారు.
MAA
Tollywood
Rajendra Prasad

More Telugu News