వైసీపీ నేత‌ల తీరుపై మండిప‌డ్డ అచ్చెన్నాయుడు

17-10-2021 Sun 12:49
  • ప్రకాశం జిల్లా మద్దలకట్టలో దళితులపై వైసీపీ నేతల దాడి
  • దళితులను అణచివేయడమే ల‌క్ష్యమా?
  • దాడులు చేస్తోన్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి
atchennaidu slams ycp
వైసీపీ నేత‌ల తీరుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా మద్దలకట్టలో దళితులపై వైసీపీ నేతలు దాడికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. దళితులను అణచివేయడమే ల‌క్ష్యంగా వైసీపీ ప‌నిచేస్తున్న‌ట్లుంద‌ని ఆయ‌న అన్నారు. ద‌ళితుల‌పై దాడులు చేస్తోన్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే అందుకు కార‌ణం దళితులా? అని ఆయ‌న నిల‌దీశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. వైసీపీలోని ఓ వర్గానికి ఆ మంత్రి భయపడుతున్నారని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో దళితుల భూములకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.