శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్.. వీడియో ఇదిగో

17-10-2021 Sun 12:46
  • గుసగుసలు మంచిది కాదని సున్నితంగా వార్నింగ్
  • ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయని వ్యాఖ్య
  • అక్కడి నుంచి వెళ్లిపోయిన మధుమిత
Mohan Babu Angry On Shiva Balaji Wife
శివబాలాజీ భార్య మధుమితపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ‘మా’ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, గెలుపోటములు దైవాధీనమని అన్నారు. ‘మా’ రాజకీయ వేదిక కాదని, అయితే పాలిటిక్స్ ఇక్కడే ఎక్కువగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే మధ్యలో ఆయన మధుమితపై సీరియస్ అయ్యారు. పెద్దలు ప్రసంగిస్తున్నప్పుడు గుసగుసలు, సైగలు చేయడం మంచిది కాదని, తనకు నచ్చదని సున్నితంగా హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల మాట్లాడాలనుకున్న ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయని అన్నారు. దీంతో మధుమిత స్టేజీపై నుంచి వెళ్లిపోయారు.