‘మా’పై తనదైనశైలిలో రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు

17-10-2021 Sun 12:08
  • సర్కస్ అని నిరూపించారని ట్వీట్
  • ప్రేక్షకుల ముందు ప్రూవ్ చేశారని కామెంట్
  • ‘మా’ ఎన్నికల హైడ్రామాపై స్పందన
RGV Criticizes MAA Elections Says Proven Circus
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మొదలు.. ఫలితాలొచ్చేదాకా సాగిన హైడ్రామా అంతాఇంతా కాదు. ఇటు విష్ణు వర్గం వారు, అటు ప్రకాశ్ రాజ్ వర్గం వారు విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల హీట్ ను పెంచారు. ఇక, ఎన్నికలయ్యాక ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఎన్నెన్నో ఆరోపణలు చేస్తూ.. తమ పదవులకు ఏకంగా రాజీనామానే చేశారు.

అయితే, తాజాగా ‘మా’ ఎన్నికలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మా’ను సర్కస్ తో పోలుస్తూ ఓ ట్వీట్ వదిలారు. ‘‘మేమంతా ఓ సర్కస్ అని ప్రేక్షకులకు సినీ‘మా’ జనం మరోసారి నిరూపించారు’’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు చర్చకు తెరదీశారు. ఎవరిగురించి అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజమేనని కొందరు రిప్లై ఇస్తుంటే.. మెగా ఫ్యామిలీ గురించేనంటూ కొందరు, లేదూ నరేశ్ గురించి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.