ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు దుర్మరణం

17-10-2021 Sun 09:47
  • ముదిగొండ మండలం బాణాపురం వద్ద ఘటన
  • దేవీ విగ్రహ నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు ట్రాక్టర్‌పై భక్తులు
  • పలువురికి తీవ్ర గాయాలు
road accident in khamma dist 4 dead on spot
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. దుర్గాదేవి విగ్రహ నిమజ్జన ఉత్సవానికి భక్తులు ట్రాక్టర్‌పై వెళ్తున్న సమయంలో అది ఒక్కసారిగా బోల్తాపడింది. ముదిగొండ మండలం బాణాపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను 108 అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.