Aryan Khan: ఆర్యన్‌ఖాన్‌కు కౌన్సెలింగ్.. ఇకపై పేదల కోసమే పనిచేస్తానన్న షారూఖ్ తనయుడు

  • డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్
  • జైలులో కౌన్సెలింగ్ ఇచ్చిన ఎన్‌సీబీ అధికారులు
  • ఇకపై తనను చూసి గర్వించేలా పనిచేస్తానని హామీ
NCB Gave Counselling To Aryan Khan

ముంబై తీరంలోని క్రూయిజ్ నౌకలో ఈ నెల 2న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ అధికారులు నిన్న కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యన్ మాట్లాడుతూ.. జైలు నుంచి విడుదలైన తర్వాత తాను పేదల కోసం పనిచేస్తానని చెప్పినట్టు సమాచారం.

ఇకపై చెడ్డపేరు తీసుకొచ్చే పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లబోనని హామీ ఇచ్చాడు. అలాగే పలు అంశాలపై మాట్లాడాడు. ఇకపై పేదలకు, అణగారిన వర్గాలకు చేయూత అందిస్తానని, తనను చూసి ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తానని అధికారులకు తెలిపాడు. కాగా, ఆర్యన్ పెట్టుకున్న బెయిలు పిటిషన్‌పై ఇది వరకే విచారణ జరిపిన కోర్టు ఈ నెల 20న తీర్పు ఇవ్వనుంది.

More Telugu News