దక్షిణాదిన అత్యంత ప్రభావశీల నటుల్లో నెంబర్ వన్ గా రష్మిక, నెంబర్ టూలో విజయ్ దేవరకొండ

16-10-2021 Sat 21:12
  • సోషల్ మీడియా పాప్యులారిటీ ఆధారంగా జాబితా
  • ఇన్ స్టాగ్రామ్ పోస్టులే ప్రాతిపదిక
  • గత 25 పోస్టులకు వచ్చిన స్పందన మదింపు
  • అల్లు అర్జున్ కు 5, ప్రభాస్ కు 8వ స్థానం
Forbes South India most influential stars list
దక్షిణాది సినీ తారల సోషల్ మీడియా పాప్యులారిటీ ఆధారంగా ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితా రూపొందించింది. ఇందులో రష్మిక మందన్న 9.88 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, విజయ్ దేవరకొండ (9.67) రెండోస్థానంలో ఉన్నాడు. కన్నడ స్టార్ యశ్ (9.54) మూడో స్థానంలో, సమంత (9.49) నాలుగో స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ (9.46) కు ఐదో స్థానం, ప్రభాస్ (9.40) కు ఎనిమిదో స్థానం లభించాయి.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ నటీనటులు ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టులు, వాటికి వచ్చిన ఆదరణను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు. ఆయా సినీ స్టార్లు ఇన్ స్టాగ్రామ్ లో చేసిన గత 25 పోస్టులను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ జాబితాల రూపకల్పనలో ఫోర్బ్స్ ఇండియా, సోషల్ సమోసా (సోషల్ మీడియా ఇండస్ట్రీ న్యూస్ అండ్ అనాలిసిస్ పోర్టల్), ఖోరజ్ (మార్కెటింగ్ టెక్నాలజీ సంస్థ) పాలుపంచుకున్నాయి.