24 గంటలూ కరెంటు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు

  • ఏపీలో విద్యుత్ పరిస్థితిపై స్పందన
  • ఆర్టీపీపీలో ఉత్పత్తి ప్రారంభం
  • వినియోగానికి సరిపడా విద్యుత్ ఉందన్న సీఎండీ
  • విద్యుత్ ఎక్చేంజిలో యూనిట్ ధర తగ్గిందని వెల్లడి
APSPDCL CMD Haranatha Rao talks about state electricity situations

ఏపీలో విద్యుత్ పరిస్థితులపై ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హరనాథరావు స్పందించారు. రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్టీపీపీ, నెల్లూరు సంజీవయ్య ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. అటు విద్యుత్ ఎక్చేంజిలో యూనిట్ ధర రూ.15 నుంచి రూ 6.11కి తగ్గిందని తెలిపారు.

వినియోగానికి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హరనాథరావు వివరించారు. విద్యుత్ సమస్యల కోసం ప్రత్యేకంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

More Telugu News