ఏపీలో 400కి దిగువన కరోనా రోజువారీ కేసులు

16-10-2021 Sat 18:16
  • గత 24 గంటల్లో 29,243 కరోనా పరీక్షలు
  • 332 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 55 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఏడుగురి మృతి
  • ఇంకా 6,193 మందికి చికిత్స
AP Corona daily status report
ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల వ్యవధిలో 29,243 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 332 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 55 కొత్త కేసులు నమోదు కాగా, కడప జిల్లాలో 43, గుంటూరు జిల్లాలో 42 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం, కర్నూలు జిల్లాలలో 3 కేసుల చొప్పున గుర్తించారు.

అదే సమయంలో 585 మంది కోలుకోగా, ఏడుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,302కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,040 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,39,545 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,193 మంది చికిత్స పొందుతున్నారు.