జగన్ లేఖకు మోదీ స్పందించారనేది నిజమేనా?: రఘురామకృష్ణరాజు

16-10-2021 Sat 18:03
  • రాష్ట్రంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి
  • ఆక్వా సాగు ఉన్న ప్రాంతాల్లో కూడా రోజుకు 3 గంటలు కరెంట్ కట్ చేస్తున్నారు
  • ఢిల్లీలో ఉన్నా నా మనసు రాష్ట్రం గురించే ఆలోచిస్తుంది
Power cuts started in AP says Raghu Rama Krishna Raju
ఏపీలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆక్వా సాగు ఉన్న ప్రాంతాల్లో కూడా రోజూ మూడు గంటల చొప్పున కరెంట్ కట్ చేస్తున్నారని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గునే ఇవ్వలేని వారు... ఆక్వాకు సీడ్, ఫీడ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బొగ్గు గురించి సీఎం జగన్ రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందించారని చెప్పుకుంటున్నారని... అది నిజమేనా? అని అనుమానం వ్యక్తం చేశారు.

తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ తన మనసు సొంత రాష్ట్రం గురించే ఆలోచిస్తుంటుందని చెప్పారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళికను జగన్ రూపొందించాలని సూచించారు. శాసనమండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని... వైసీపీ ఎంపీగా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ తాను కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసి కోరతానని చెప్పారు.