తెలుగు వెబ్ సిరీస్ లో నటిస్తున్న త్రిష

16-10-2021 Sat 17:58
  • త్రిష ప్రధాన పాత్రలో 'బృంద' 
  • సూర్య వంగాల దర్శకత్వం
  • నిన్న ఓపెనింగ్ సెర్మనీ
  • సోనీ లివ్ లో ప్రసారం కానున్న బృంద
Trisha acts her first web series
దక్షిణాది నటి త్రిష తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సూర్య వంగాల దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ కు 'బృంద' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ తెలుగులో వస్తోంది. దీన్ని ఇతర భాషల్లోకి కూడా డబ్ చేయనున్నారు. ఓ థ్రిల్లింగ్ క్రైమ్ కేసు విచారణ ఇతివృత్తంగా బృంద వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలను త్రిష సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇది సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం కానుంది. అక్టోబరు 15 విజయదశమి సందర్భంగా ముహూర్తం షాట్ చిత్రీకరంచారు.

కాగా, కొన్నాళ్ల కిందట త్రిష నటించిన 'పరమపదం విలయాట్టు' చిత్రం నేరుగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ వేదికపై విడుదలైంది. త్రిష ప్రస్తుతం బృంద వెబ్ సిరీస్ తో పాటు 'ద్విత్వ' అనే కన్నడ చిత్రంలోనూ నటిస్తోంది.