పాన్ ఇండియా సినిమాగా రానా సస్పెన్స్ థ్రిల్లర్?

16-10-2021 Sat 17:56
  • ఆశించిన స్థాయిలో ఆడని 'అరణ్య'
  • విడుదలకి సిద్ధమైన 'విరాటపర్వం'
  • ఒక వైపున వెంకీతో వెబ్ సిరీస్
  • మరో వైపున మిలింద్ రావ్ తో సెట్స్ పైకి
Rana Pan India Movie Update
రానా కథానాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఆ మధ్య వచ్చిన 'అరణ్య' .. ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఇక ఆయన నుంచి 'విరాటపర్వం' సినిమా రానుంది. మరో వైపున 'రానా నాయుడు' వెబ్ సిరీస్ చేయడానికి రానా రెడీ అవుతున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో ఆయన వెంకటేశ్ తో కలిసి నటిస్తుండటం విశేషం.

ఇక ఈ నేపథ్యంలోనే రానా హీరోగా మిలింద్ రావ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందనున్నట్టు నిన్న ఓ ప్రకటన వచ్చింది. గోపీనాథ్ ఆచంట .. రాంబాబు .. అర్జున్ దాస్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషలలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా జోనర్ గురించిన టాక్ నడుస్తోంది. మిలింద్ రావ్ సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. గతంలో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'అవళ్' (గృహం) .. నయనతార చేసిన 'నేత్రికన్' ఆయన దర్శకత్వంలో వచ్చినవే. అందువలన రానా సినిమా కూడా అదే జోనర్లో ఉండనుందా? అనేది ఆసక్తికరంగా మారింది.