హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడే కరెక్ట్: ఎంఎస్కే ప్రసాద్

16-10-2021 Sat 17:06
  • రవిశాస్త్రి హయాంలో టీమిండియా మంచి విజయాలు సాధించింది
  • ఇదే పరంపర కొనసాగాలంటే ద్రావిడ్ ను కోచ్ చేయాల్సిందే
  • ద్రావిడ్ ఆటగాళ్లతో సులభంగా కలసిపోతాడు
Rahul Dravid Best Candidate To Coach Team India Says MSK Prasad
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పోస్టుకు క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడే బెస్ట్ అని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చెప్పారు. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి హయాంలో సాధించిన విజయాల పరంపరను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలంటే కోచ్ గా ద్రావిడ్ ను నియమించాలని అన్నారు. టీమ్ మేనేజ్ మెంట్, టీమ్ సభ్యులతో ద్రావిడ్ సులభంగా కలిసిపోతారని చెప్పారు. ఇండియా కోచ్ పదవికి ద్రావిడే కరెక్ట్ అనే విషయాన్ని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.

రవిశాస్త్రి హయాంలో ఇండియా మంచి విజయాలను సాధించిందని... ఆస్ట్రేలియాలో కూడా సిరీస్ లను గెలుపొందిందని చెప్పారు. వరుసగా సిరీస్ లు గెలవడం సులభమైన విషయం కాదని... ఇదే పర్ఫామెన్స్ ను కంటిన్యూ చేయాలంటే ద్రావిడ్ ను కోచ్ చేయాల్సిందేనని అన్నారు.