విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కుమారి

16-10-2021 Sat 16:24
  • కుమారి తలపై రూ.4 లక్షల రివార్డు
  • 6 హత్యల్లో ప్రమేయం
  • మావోయిస్టు పార్టీలో వివక్ష ఉందన్న పోలీసులు
  • అందుకే కుమారి బయటికి వచ్చేసిందని వెల్లడి
Maosit Swetha surrender to Vizag police
సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు కొర్రా కుమారి అలియాస్ శ్వేత విశాఖ పోలీసులు ఎదుట లొంగిపోయింది. మావోయిస్టు కుమారిపై రూ.4 లక్షల రివార్డు ఉంది. 6 హత్యలు, 5 ఎదురుకాల్పుల ఘటనలు, 2 పేలుడు ఘటనలతో పాటు.. ఇంకా అనేక ఘటనల్లో ఆమె ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.

వ్యక్తిగత కారణాలతో పాటు, మావోయిస్టు పార్టీలో వివక్ష, విభేదాలు, పలు ఎన్ కౌంటర్లలో సహచరులను కోల్పోవడం వంటి కారణాలతో కుమారి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకుందని పోలీసులు తెలిపారు. కుమారి 2009లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిందని, అప్పటి నుంచి 12 ఏళ్ల పాటు క్రియాశీలకంగా కొనసాగిందని విశాఖ ఎస్పీ బి.కృష్ణారావు వెల్లడించారు.