ఒక్కో ఎపిసోడ్ కు రూ.40 లక్షలు.. ‘అన్ స్టాపబుల్’ కోసం బాలయ్యకు భారీ పారితోషికం!

16-10-2021 Sat 14:39
  • రేంజ్, క్రేజ్ కు తగ్గట్టు పారితోషికం ఇస్తున్న అల్లు అరవింద్
  • మొత్తం 12 ఎపిసోడ్లుగా షో 
  • నవంబర్ 4 నుంచి ఆహాలో షో
Balayya Charging 40 Lakhs per Episode For Unstoppable
డైలాగులతో సినిమాల్లో ప్రత్యర్థిని వణికించే బాలయ్య బాబు.. ఇప్పుడు చిన్నతెరపై కనువిందు చేయబోతున్నారు. ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అంటూ త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4 నుంచి ప్రసారం కాబోతున్న ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి ఇటీవలే భారీ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొదటి ఎపిసోడ్ లో బాలయ్య ఎన్ కౌంటర్ చేసే తొలి గెస్ట్ ఎవరు? అసలు కార్యక్రమం కోసం ఆయనెంత చార్జ్ చేస్తున్నారు? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఒక్కో ఎపిసోడ్ కు బాలయ్య బాబు రూ.40 లక్షలు చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య రేంజ్, క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్, ఆహా టీం ఆయనకు భారీగానే ముట్టుజెబుతున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ షో మొత్తం 12 ఎపిసోడ్ లుగా స్ట్రీమింగ్ అవుతుంది.