గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాపైన శిశువు క్షేమం

16-10-2021 Sat 14:26
  • జీజీహెచ్ లో నాలుగు రోజుల శిశువు అపహరణ
  • మరో మహిళతో కలిసి వార్డ్ బాయ్ దుశ్చర్య
  • సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితుల గుర్తింపు
  • శిశువును తల్లిదండ్రులకు అప్పగింత
Police traced and rescue child in Guntur
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ వ్యవహారం సుఖాంతమైంది. గత అర్థరాత్రి దాటిన తర్వాత శిశువు అపహరణకు గురికాగా, పోలీసులు తీవ్రంగా శ్రమించి కేసును ఛేదించారు. జీజీహెచ్ వార్డ్ బాయ్, ఓ మహిళ కలిసి ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు గుర్తించారు. వారిని గుంటూరు నెహ్రూ నగర్ ఒకటో లైనులోని ఓ ఇంటిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల ఆచూకీ లభ్యమైంది. శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.