మిగిలిన దేశాలన్నీ జాగ్రత్తగా ఉండాల్సిందే: ద్రావిడ్ రాకపై మైఖేల్ వాన్ స్పందన

  • టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్
  • టీ20 ప్రపంచకప్ తర్వాత ముగుస్తున్న రవిశాస్త్రి పదవీకాలం
  • ఇతర దేశాల జట్లను హెచ్చరించిన వాన్
Michael Vaughan response on Rahul Dravid as Team India Head Coach

టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలను చేపట్టబోతున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియబోతోంది. అనంతరం ద్రావిడ్ పగ్గాలు స్వీకరించబోతున్నారు. భారత క్రికెట్ కు సుదీర్ఘకాలం పాటు ద్రావిడ్ అద్భుతమైన బ్యాట్స్ మెన్ గా సేవలందించారు. మిస్టర్ వాల్ గా, మిస్టర్ డిపెండబుల్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచ్ గా మారారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ అండర్-19 కోచ్ గా పేరుగాంచారు.

ఈ నేపథ్యంలో ద్రావిడ్ కోచ్ గా పగ్గాలు చేపడితే టీమిండియా మరింత పటిష్ఠంగా తయారవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్పందిస్తూ... ఇండియా కోచ్ గా ద్రావిడ్ నియామకం నిజమే అయితే... మిగిలిన దేశాలన్నీ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాల్సిందేనని ట్వీట్ చేశాడు. రాహుల్ ద్రావిడ్ శక్తి సామర్థ్యాలు ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ట్వీట్ చాలు.

More Telugu News