Cricket: 'నాకు చాలా మంది కీపర్లున్నారు..' అంటూ పంత్ కు కౌంటర్ ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ.. వీడియో ఇదిగో

Virat Kohli Challenges Rishabh Pant
  • టీ20 వరల్డ్ కప్  ప్రోమో విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్
  • పంత్, కోహ్లీ మధ్య ఆసక్తికర సంభాషణ
  • ధోనీ తర్వాత అలాంటి కీపర్ లేడన్న కోహ్లీ
  • నేనున్నానన్న రిషభ్ పంత్
  •  వార్మప్ లలో నిరూపించుకోవాలన్న కెప్టెన్
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. తనకు చాలా మంది కీపర్లున్నారని, ముందు నువ్వేంటో నిరూపించుకోవాలని పంత్ కు సవాల్ చేశాడు. త్వరలో టీ20 వరల్డ్ కప్ మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘స్కిప్పర్ కాలింగ్ కీపర్’ పేరుతో స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రోమో వీడియోను రూపొందించింది. అందులో భాగంగా పంత్ కు కోహ్లీ కాల్ చేసి మాట్లాడాడు.

టీ20 మ్యాచ్ లను సిక్సర్లే గెలిపిస్తాయంటూ పంత్ కు కోహ్లీ చెప్తే.. బెంగ వద్దని తాను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నానని పంత్ సమాధానమిచ్చాడు. సిక్సర్ కొట్టి ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చి పెట్టింది కీపరే కదా అని ధోనీని ఉద్దేశించి అన్నాడు. అయితే, మహీ భాయ్ తర్వాత అలాంటి కీపర్లు రాలేదని కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు.

దానికి ‘భయ్యా నేనున్నాను కదా నీ కీపర్ ని’ అని పంత్ చెప్పగానే.. తన దగ్గర చాలా మంది కీపర్లున్నారని, వార్మప్ మ్యాచ్ లలో ఎవరు నిరూపించుకుంటారో చూద్దామంటూ కోహ్లీ సవాల్ విసిరాడు. 'ఏంది విరాట్ భయ్యా?' అంటూ పంత్ ముగించాడు.

కాగా, ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమేనని, త్వరలోనే సెకండ్ పార్ట్ వస్తుందని స్టార్ స్పోర్ట్స్ ఆ వీడియోకు పోస్ట్ జత చేసింది. కాగా, ఈ నెల 18న ఇంగ్లండ్ తో, 20న ఆస్ట్రేలియాతో టీమిండియా వార్మప్ మ్యాచ్ లను ఆడనుంది.
Cricket
T20 World Cup
Virat Kohli
Rishabh Pant
Wicket Keeper

More Telugu News