'ఆది పురుష్'లో తన పోర్షన్ ను పూర్తిచేసిన కృతి సనన్!

16-10-2021 Sat 11:56
  • షూటింగు దశలో 'ఆది పురుష్'
  • ఇటీవలే సైఫ్ షూటింగ్ పూర్తి 
  • తాజాగా ముగించిన కృతి
  • ఆగస్టు 11వ తేదీన విడుదల  
Adi Purush movie Update
రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ 'ఆది పురుష్' సినిమాను రూపొందిస్తున్నాడు. టి - సిరీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తూ ఉండగా, సీతాదేవి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. సీత పాత్రకి ఆమెను ఎంపిక చేయడం పట్ల కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ, దర్శక నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఇక లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ .. హనుమ పాత్రను దేవ్ దత్ పోషిస్తున్నారు. ప్రతినాయకుడైన రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. రీసెంట్ గా ఆయన తన పోర్షన్ ను కంప్లీట్ చేసి వెళ్లిపోయాడు. తాజాగా సీత పాత్రకు సంబంధించిన తన పోర్షన్ ను కృతి సనన్ పూర్తిచేసింది. దాంతో ఈ సినిమా టీమ్ ఆమెతో కేక్ కట్ చేయించి వీడ్కోలు పలికారు.

సీత పాత్రలో ఆమె అద్భుతంగా చేసిందనీ .. అప్పుడే ఆమె పాత్ర పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాననీ .. ఆమెతో ఈ జర్నీని ఎప్పటికీ మరిచిపోలేనని ఓం రౌత్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. 3D ఫార్మెట్ లోను రూపొందుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఆగస్టు 11వ తేదీన థియేటర్లకు రానుంది.