'భోళా శంకర్' కోసం అదిరిపోయే ట్యూన్ రెడీ!

  • 'గాడ్ ఫాదర్' షూటింగులో చిరూ
  • నెక్స్ట్ సినిమా మెహర్ రమేశ్ తో
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • చకచకా జరుగుతున్న సన్నాహాలు  
Bhola Shankar movie update

ప్రస్తుతం చిరంజీవి 'లూసీఫర్' రీమేక్ గా 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత చిరంజీవి .. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. కొంతకాలం క్రితం తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్.

ఈ సినిమాకి 'భోళా శంకర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ ను తీసుకున్నారు. నిన్న విజయదశమి .. పైగా మహతి స్వరసాగర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో 'భోళా శంకర్' సినిమాకి సంబంధించిన ఒక ట్యూన్ చేయించుకున్నాననీ .. అద్భుతంగా వచ్చిందని మెహర్ రమేశ్ చెప్పాడు.

సాధారణంగా చిరంజీవి తన సినిమాలకి మణిశర్మ సంగీత దర్శకుడిగా ఉండాలని భావిస్తారు. అందుకు కారణం ఈ ఇద్దరి కాంబినేషన్లో చాలా హిట్లు రావడమే. అలాంటిది ఈ సారి ఆయన తనయుడిపై గల నమ్మకంతో చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. మొత్తానికి మెహర్ రమేశ్ ప్రాజెక్టు కూడా స్పీడ్ మీదే ఉందనే విషయం ఈ అప్ డేట్ వలన అర్థమవుతోంది..

More Telugu News