నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

16-10-2021 Sat 11:05
  • సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
  • రేపు ఉదయం 5 గంటల నుంచి భక్తులకు అనుమతి
  • అక్టోబర్ 21 వరకు తెరుచుకోనున్న ఆలయం
Sabarimala temple to open today
కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో కొలుచుకునే అయ్యప్పస్వామి కొలువుండే శబరిమల ఆలయం ఈరోజు తెరుచుకోనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్వోం బోర్డు ప్రకటించింది. అయితే ఈరోజు కేవలం ఆలయ అర్చకులు, సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది.

రేపు ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తులను అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసి వేస్తారు. మరోవైపు ఆలయం తలుపులు తెరుచుకుంటున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఏలోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.