షూటింగు పార్టు పూర్తిచేసుకున్న 'థ్యాంక్యూ'

16-10-2021 Sat 10:59
  • విక్రమ్ కుమార్ నుంచి మరో విభిన్న చిత్రం
  • నాగచైతన్య సరసన నాయికగా రాశి ఖన్నా
  • ముఖ్య పాత్రల్లో అవిక .. మాళవిక నాయర్
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు  
Thank You movie shooting completed
విక్రమ్ కుమార్ కెరియర్ ను పరిశీలిస్తే ఆయన తీరు ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఒకదానికి ఒకటి ఎంతమాత్రం సంబంధంలేని కథలను ఎంచుకుంటూ, ఎప్పటికప్పుడు జోనర్లను మార్చుకుంటూ ఆయన ముందుకెళుతుంటాడు. అందుకు ఉదాహరణగా ఆయన కెరియర్లో '24' .. '13 బి' .. 'ఇష్క్' వంటి సినిమాలు కనిపిస్తాయి.

ఆయన తాజా చిత్రంగా ' థ్యాంక్యూ' ఆ మధ్య పట్టాలపైకి వెళ్లింది. కరోనా కారణంగా ఎదురవుతున్న అవరోధాలను అధిగమిస్తూనే షూటింగు చేస్తూ వెళ్లారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్న పీసీ శ్రీరామ్ వెల్లడించారు.

చైతూ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాలో ఆయన జోడీగా రాశి ఖన్నా అందాల సందడి చేయనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. అవిక గోర్ .. మాళవిక నాయర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ ఏడాది 'లవ్ స్టోరీ'తో హిట్ కొట్టిన చైతూ, వచ్చే ఏడాది 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడన్న మాట.