తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

15-10-2021 Fri 21:18
  • 24 గంటల్లో 104 కేసుల నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 48 కేసుల నిర్ధారణ
  • తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,056
Corona cases in Telangana decreased drastically
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కేవలం 104 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 218 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఒక వ్యక్తి కరోనా కారణంగా మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,68,722 కేసులు నమోదయ్యాయి. వీరిలో 6,60,730 మంది కోలుకున్నారు. మొత్తం 3,936 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,056 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 48 కేసులు నమోదయ్యాయి.