ఐపీఎల్ ఫైనల్స్.. భారీ స్కోరు దిశగా చెన్నై సూపర్ కింగ్స్

15-10-2021 Fri 20:18
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్
  • తొలి వికెట్ కు 61 పరుగులు జోడించిన సీఎస్కే ఓపెనర్లు
  • 32 పరుగుల వద్ద ఔటయిన గైక్వాడ్
CSK openers performed well in IPL finals
చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ఇన్నింగ్స్ ను ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ ప్రారంభించారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 8.1 ఓవర్లలో 61 పరుగులు జోడించారు. స్కోర్ బోర్డు వేగంగా కదులుతున్న సమయంలో గైక్వాడ్ 32 (27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. నరైన్ బౌలింగ్ లో శివమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత డుప్లెసిస్ (28 పరుగులు)కి రాబిన్ ఉతప్ప (2 పరుగులు) జతకలిశాడు. ప్రస్తుతం చెన్నై స్కోరు 9 ఓవర్లకు 65 పరుగులు.