టెన్త్ క్లాస్ రోజులను గుర్తుకు తెచ్చే '10th క్లాస్ డైరీస్'

15-10-2021 Fri 18:58
  • దర్శకుడిగా మారిన సినిమాటోగ్రఫర్
  • ప్రధానమైన పాత్రలో అవికా గోర్
  • షూటింగు పార్టు పూర్తి
  • త్వరలో మిగతా వివరాలు  
10th class dairys title poster released
సినిమాటోగ్రఫర్ గా అంజికి మంచి పేరు ఉంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఇంతవరకూ ఆయన 49 సినిమాలకు పనిచేశారు. తన 50వ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా మారాలనే ఉద్దేశంతో ఆయన ఆ దిశగా అడుగులు వేశాడు. అలా ఆయన రూపొందించిన సినిమానే '10th క్లాస్ డైరీస్'.

అచ్యుత రామారావు - మన్యం రవితేజ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీరామ్ - అవిక గోర్ ఈ సినిమాలో నాయకా నాయికలుగా కనిపించనున్నారు. విజయదశమి సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అంజి ఈ సినిమాను గురించి మాట్లాడాడు.

"జీవితంలోని ప్రతి ఒక్కరికీ 10th క్లాస్ రోజులను గుర్తుకు చేసే సినిమా ఇది. అవికా చేసిన సినిమాల్లో 'ఉయ్యాలా జంపాలా' తరువాత స్థానంలో ఈ సినిమా నిలుస్తుంది. హైదరాబాద్ .. రాజమండ్రి .. అమెరికాలో జరిపిన చిత్రీకరణతో షూటింగ్ పార్టును పూర్తి చేశాము. సురేశ్ బొబ్బిలి సంగీతం ఆకట్టుకుంటుంది. త్వరలోనే మిగతా వివరాలను తెలియజేస్తాము" అని చెప్పుకొచ్చాడు.