సంప్రదాయబద్ధంగా వాహన, ఆయుధపూజ నిర్వహించిన కేసీఆర్.. ఫొటోలు ఇవిగో!

15-10-2021 Fri 18:22
  • విజయదశమి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి పూజలు
  • ప్రగతి భవన్ లోని పోచమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన కేసీఆర్
  • జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు
KCR performs pooja in Pragathi Bhavan
విజయదశమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించారు. జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య, ఇతర కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.