'వరుడు కావలెను' కొత్త రిలీజ్ డేట్!

15-10-2021 Fri 18:21
  • నాగశౌర్య నుంచి 'వరుడు కావలెను'
  • ప్రేమ .. పెళ్లి మధ్య నడిచే కథ 
  • కీలకమైన పాత్రలో నదియా 
  • ఈ నెల 29వ తేదీన విడుదల  
Varudu Kavalenu New release date confirmed
నాగశౌర్య కథానాయకుడిగా .. రీతూ వర్మ కథానాయికగా 'వరుడు కావలెను' సినిమా రూపొందింది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు. ప్రేమ .. పెళ్లి .. ఈ రెండింటి మధ్య చోటుచేసుకునే భావోద్వేగాలతో ఈ కథ నడవనుంది.

నిజానికి ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసుకోవడం జరిగింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

తమన్ .. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీత దర్శకులుగా వ్యవహరించారు. కోలకళ్ల .. దిగు దిగు నాగ .. మనసులోనే నిలిచిపోకే .. అనే పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. ఈ సినిమాలో నదియా కీలకమైన పాత్రను పోషించింది. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో మురళీ శర్మ .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. .