ఏపీలో మరో 586 కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

15-10-2021 Fri 18:05
  • 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మృతి
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 119 కేసులు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,453
Corona cases in AP increasing again
ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 540 కేసులు నమోదు కాగా... ఈరోజు ఆ సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 44,946 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 586 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 119 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 5 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో 9 మంది మృతి చెందగా... 712 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,59,708కి పెరిగింది. మొత్తం 20,38,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 14,295 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,453 యాక్టివ్ కేసులు ఉన్నాయి.