మన్మోహన్ త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్థిద్దాం: కాంగ్రెస్

15-10-2021 Fri 16:19
  • మన్మోహన్ ఆరోగ్యంగా ఉన్నారు
  • నిన్నటి కంటే ఆరోగ్యం మెరుగయింది
  • అనవసరమైన ఊహాగానాలకు ఎవరూ తావివ్వొద్దు
Manmohan health is better than yesterday says Congress
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంగా ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రణవ్ ఝా తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్థిద్దామని కోరారు. మన్మోహన్ ఏకాంతాన్ని అందరం గౌరవిద్దామని విన్నవించారు. అనవసరమైన ఊహాగానాలకు ఎవరూ తావివ్వొద్దని కోరారు.

మన్మోహన్ సింగ్ ఇటీవలే జ్వరం బారిన పడ్డారు. చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. అయితే నీరసంగా ఉండటంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మరోవైపు మన్మోహన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ నిన్న ట్వీట్ చేశారు.