తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చిరుత కలకలం

15-10-2021 Fri 15:06
  • నిన్న అర్ధరాత్రి యూనివర్శిటీలో ప్రవేశించిన చిరుత
  • రోడ్లపై, చెట్ల మధ్య చక్కర్లు
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన చిరుత కదలికలు
Leopard found in Tirupati SV University
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీలో చిరుత కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి యూనివర్శిటీలోకి ప్రవేశించిన చిరుత.. క్యాంపస్ లో చక్కర్లు కొట్టింది. వెటర్నరీ కాలేజీ ఉమెన్స్ హాస్టల్ దగ్గర చిరుత ఎక్కువ సేపు సంచరించింది. రోడ్లపై, చెట్ల మధ్యన తిరిగింది. చిరుత తిరుగుతుండటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చిరుత తిరిగిందనే వార్తలతో యూనివర్శిటీలోని విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

కొన్ని రోజులుగా రాత్రి పూట చిరుత తిరుగుతోందని వారు అంటున్నారు. చీకటి పడిన తర్వాత చిరుత క్యాంపస్ లోకి వస్తోందని... దీంతో రాత్రి పూట బయటకు రాలేకపోతున్నామని చెపుతున్నారు. చిరుతను పట్టుకోవాలని యూనివర్శిటీ విద్యార్థులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కోరుతున్నారు.