rk: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణ వార్త‌ల‌పై స్పందించిన ఆయ‌న భార్య శిరీష‌

  • దీనిపై పార్టీ ప్ర‌క‌ట‌న చేస్తే ఆ విష‌యం నిజమ‌ని భావిస్తాం
  • మీడియాలో వచ్చే వార్తలే చూస్తున్నాం
  • ఛత్తీస్‌గ‌ఢ్ డీజీపీ కూడా ప్రకటించారు
  • ఆయనకు ఈ సమాచారం ఎవరు చెప్పారు
shirisha on rk death

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) అనారోగ్యంతో మృతి చెందార‌ని పోలీసులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆర్కే మృతి చెందార‌న్న విష‌యాన్ని మావోయిస్టు పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీనిపై ఆర్కే భార్య శిరీష స్పందించారు.

దీనిపై పార్టీ ప్ర‌క‌ట‌న చేస్తే ఆ విష‌యం నిజమ‌ని భావిస్తామని చెప్పారు. ఆర్కే మృతి చెందినట్టుగా మీడియాలో వచ్చే వార్తలే చూస్తున్నామని చెప్పారు. అలాగే, ఆయ‌న‌ మృతి చెందారని ఛత్తీస్‌గ‌ఢ్ డీజీపీ ప్రకటించారని తెలిపారు. అయితే, ఆయనకు ఈ సమాచారం ఎవరు చెప్పార‌ని ఆమె ప్ర‌శ్నించారు.

త‌న భ‌ర్త‌ జీవితం మొత్తం ప్రజల కోసం ధార పోశారని తెలిపారు. పోరాటంలో ఆయన త‌న‌ బిడ్డను కూడా పోగొట్టుకున్నారని శిరీష అన్నారు. ఒకవేళ ఆర్కే మృతి చెందిన విష‌యం నిజమైతే ఆయన మృత‌దేహాన్ని తాము అక్కడ నుంచి తెచ్చుకునేలా సహకరించాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. కాగా, దండకారణ్యం పరిధిలోని బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో మూడు రోజుల క్రితమే ఆర్కే మరణించినట్టు వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News