'అర్జున ఫల్గుణ' నుంచి కొత్త పోస్టర్!

15-10-2021 Fri 11:55
  • శ్రీవిష్ణు నుంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ 
  • కథానాయికగా అమృత అయ్యర్ 
  • కొత్త దర్శకుడి పరిచయం 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
Arjuna Falguna movie poster
శ్రీవిష్ణు కథానాయకుడిగా ఈ మధ్య వచ్చిన 'రాజ రాజ చోర' సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుని, శ్రీవిష్ణు తేలికగా ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి రావడానికి 'భళా తందనాన' సినిమా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన 'అర్జున ఫల్గుణ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ను కూడా పట్టాలెక్కించాడు.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ మర్నీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వదులుతున్న ప్రచార చిత్రాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.'విజయదశమి' సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో కథానాయికగా అమృత అయ్యర్ నటిస్తోంది. తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన ఆమె, 'రెడ్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమై, '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే 'అర్జున ఫల్గుణ' విడుదల తేదీని ప్రకటించనున్నారు..