ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సాయితేజ్.. ఇది అంద‌రినీ సంతోష‌పెట్టే విషయమంటూ చిరంజీవి ట్వీట్!

15-10-2021 Fri 10:48
  • ఈ రోజు జ‌రుపుకుంటోన్న విజ‌య‌ద‌శ‌మికి మ‌రో ప్ర‌త్యేకత ఉంది
  • సాయి ధ‌ర‌మ్ తేజ్ పూర్తిగా కోలుకుని ఇంటికి వ‌స్తున్నాడు
  • ఇది సాయితేజ్‌కు మ‌రోజ‌న్మ‌లాంటిదే
  • తేజుకి అత్త‌, పెద్ద‌మామ నుంచి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు   
chiru tells good news
ఈ రోజు జ‌రుపుకుంటోన్న విజ‌య‌ద‌శ‌మికి మ‌రో ప్ర‌త్యేకత ఉందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి త‌ప్పించుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్, పూర్తిగా కోలుకుని ఇంటికి వ‌స్తున్నాడని చెప్పారు. ఇది అంద‌రినీ సంతోష‌పెట్టే విష‌య‌మ‌ని అన్నారు. ఇది సాయితేజ్‌కు మ‌రో జ‌న్మ‌లాంటిదేన‌ని తెలిపారు. తేజుకి అత్త‌, పెద్ద‌మామ నుంచి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని చిరు ట్వీట్ చేశారు. కాగా, ఆసుప‌త్రి నుంచి ఈ రోజు ఉద‌య‌మే సాయితేజ్ డిశ్చార్జ్ అయ్యాడు.

కాగా, ప్ర‌జ‌ల‌కు చిరంజీవి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. 'దుష్ట శక్తులపై దుర్గామాత పోరాడి సాధించిన విజయానికి చిహ్నమైన దశమి సందర్భంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. తల్లి దుర్గమ్మ ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలి. అంతిమంగా మంచికే గెలుపు అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు' అని ట్వీట్ చేశారు.