Hansika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • లేడీ ఓరియెంటెడ్ సినిమాలో హన్సిక 
  • రాజమౌళితో సినిమా గురించి మహేశ్
  • స్పోర్ట్స్ డ్రామా చేయనున్న రామ్ చరణ్
Hansika in lady oriented movie

*  హన్సిక కథానాయికగా 'మై నేమ్ ఈజ్ శృతి' పేరిట ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికి 85 శాతం పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూటింగును హైదరాబాదులో నిర్వహిస్తామని మేకర్స్ తెలిపారు.
*  మహేశ్ బాబు, రాజమౌళి కలయికలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. దీని గురించి మహేశ్ తాజాగా చెబుతూ, ఇది పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటుందనీ, భారతీయ భాషలన్నిట్లోనూ రిలీజ్ అవుతుందనీ చెప్పారు. వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళుతుంది.
*  ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న మెగా హీరో రామ్ చరణ్.. దీని తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్టు సమాచారం. గౌతమ్ చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందని, స్పోర్ట్స్ డ్రామాగా ఇది తెరకెక్కుతుందనీ తెలుస్తోంది.

More Telugu News