Karnataka: సాంబారు రుచిగా లేదట.. తుపాకితో తల్లి, సోదరిని కాల్చి చంపాడు!

Youth kills mother and sister for not cooking tasty sambar in karnataka
  • కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఘటన
  • తాగిన మత్తులో భోజనం చేస్తూ తల్లి, సోదరితో గొడవ
  • ఘటనా స్థలంలోనే మరణించిన వైనం
సాంబారు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లి, సోదరిని కాల్చి చంపాడో ఉన్మాది. కర్ణాటకలో జరిగిందీ ఘటన. దక్షిణ కన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకా కుడగోడుకు చెందిన మంజునాథ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం తాగిన మత్తులో ఇంటికొచ్చిన మంజునాథ్ భోజనం చేస్తూ సాంబారు పోసుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతడికి అది రుచించలేదు.

 దీంతో సాంబారును ఇంత దరిద్రంగా ఎలా చేశారంటూ తల్లి పార్వతి (42), సోదరి రమ్య (19)తో వాగ్వివాదానికి దిగాడు. అది మరింత ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంజునాథ్ తన వద్ద ఉన్న నాటు తుపాకితో ఇద్దరిపైనా కాల్పులు జరిపాడు. గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka
Gun Fire
Sambar
Crime News

More Telugu News