తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య

14-10-2021 Thu 22:03
  • గత 24 గంటల్లో 168 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఒకరి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,171
Media Bulletin on status of positive cases Telangana

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 168 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 207 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కేవలం ఒక్క కరోనా మరణం మాత్రమే సంభవించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,171 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 31,442 మంది నమూనాలను పరీక్షించారు. కేసుల విషయానికి వస్తే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 57 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, మెదక్, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.